నిరాశపరిచిన దేవ్ మొదటి రోజు కలెక్షన్స్ !

Published on Feb 15, 2019 4:01 pm IST

కార్తి ,రకుల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దేవ్’ నిన్న తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక టాక్ కూడా అలాగే ఉండండతో మొదటి రోజు బాక్సాఫిస్ వద్ద పూర్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం 5.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళనాడు లో ఈ చిత్రం మొదటి రోజు 3.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. కాగా ఈచిత్రానికి 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈలెక్కన ఫుల్ రన్ లో ఈ మొత్తాన్ని రాబట్టడం అసాధ్యమే.

ఇక గత ఏడాది ‘కడై కుట్టి సింగం’ తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన కార్తి ఈ సారి ‘దేవ్’ రూపంలో పరాజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు. నూతన దర్శకుడు రజత్ రవి శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :