దేవ్ రన్ టైం తగ్గించేశారు !

Published on Feb 16, 2019 2:58 pm IST


తమిళ హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘దేవ్’ ఈనెల 14న తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక టాక్ కుడి నెగిటివ్ గా రావడంతో మొదటి రోజు కలెక్షన్ల పరంగా కూడా నిరాశ పరిచింది. అయితే ఈ చిత్రానికి 3 గంటల నిడివి ఉండడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. దాంతోచిత్ర బృందం తేరుకొని అనవసరమైన సన్నివేశాలు తొలిగించి 15 నిమిషాల రన్ టైం ను తగ్గించేశారు. మరి ఈ రన్ టైం తగ్గించడం వలన సినిమాకి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రజత్ రవి శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :