దేవదాస్ ట్రైలర్ టాక్ : కింగ్ ఈజ్ బ్యాక్ !

Published on Sep 20, 2018 9:23 pm IST

నాగార్జున , నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’ ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. 2:06నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ చూస్తుంటే కామెడీ గ్యారెంటీ అని అనిపిస్తుంది. నాగ్ ,నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈచిత్రానికి హైలైట్ కానున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఆఫీసర్ చిత్రంతో అక్కినేని అభిమానులను త్రీవ నిరాశ పరిచిన నాగ్ ఈ చిత్రంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు . ట్రైలర్ లో ఫుల్ ఎనర్జీ తో కనపడుతున్నాడు నాగ్. ఈ ట్రైలర్ సినిమా మీద వున్నా అంచనాలను పెంచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఇక ఈచిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా నాని వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రష్మిక, ఆకాంక్ష సింగ్ లు కథానాయికలుగా నటిస్తుండగా మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 27న భారీ స్థాయిలో విడుదలకానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :