సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న’దేవదాస్’ !

సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న’దేవదాస్’ !

Published on Jul 13, 2018 6:00 AM IST

nani nagarjuna
నాగార్జున ,నాని లు కలిసి నటిస్తున్న మల్టీ స్టాటర్ చిత్రం’దేవదాస్’ సెప్టెంబర్ 27న విడుదల కానుందని తెలిసిందే. అయితే ఈ చిత్రం అదే రోజున విడుదల కావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈచిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెంబర్ 1’ అనే చిత్రాన్ని నిర్మించింది.

ఈ చిత్రం కూడా అదే రోజు విడుదలై మంచి విజయం సాధించటం తో పాటు , రాజమౌళి , ఎన్టీఆర్ లకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ’దేవదాస్’కు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు చిత్ర నిర్మాత అశ్వినీ దత్. మరి ఆ సెంటిమెంట్ ఈ చిత్రానికి కూడా వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా , నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు