విజయ్ తమిళంలో మరో సినిమా చేయనున్నాడా ?

Published on Oct 4, 2018 2:47 am IST


‘గీత గోవిందం’ సినిమాతో 100కోట్ల క్లబ్ లో చేరిపోయాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఈచిత్రం తో తెలుగు తో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్. ఆయన నటించిన తాజా చిత్రం’ నోటా’ అక్టోబర్ 5న విడుదలకానుంది. ఈచిత్రం తో విజయ్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

విజయ్ ఈసినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాను కూడా తమిళ్లోనే చేయనున్నాడట. ఎస్ ఆర్ ప్రభు ఈచిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. తమిళ లేడీ డైరెక్టర్ ఇందుకు సంభందించిన స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసిందట. ఈచిత్రం తెలుగు ,తమిళ భాషల్లో రూపొందనుంది. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు అలాగే ఆయన నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం విడుదలకావాల్సి వుంది.

సంబంధిత సమాచారం :