ఫ్యాన్స్ తో కలిసి సినిమా ను చూడనున్న విజయ్ !

Published on Oct 4, 2018 9:54 pm IST


సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ద్విభాషా చిత్రం ‘నోటా’ రేపు విడుదలకు సిద్ధమైంది. రేపు ఉదయం 5 గంటలకు ఫ్యాన్స్ తో కలసి చెన్నై లోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్లో విజయ్ దేవరకొండ ఈచిత్రాన్ని వీక్షించనున్నారు. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈచిత్రానికి తమిళంలో మంచి బజ్ క్రియేట్ అయింది.

ఇరుముగన్ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకం ఫై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గీత గోవిందం చిత్రం తరువాత విజయ్ నటించిన ఈచిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి. ఈచిత్రంలో మెహ్రీన్ జర్నలిస్ట్ పాత్రలో నటించగా సీనియర్ నటులు సత్యరాజ్ , నాజర్ లు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :