అందుకే అయన సూపర్ స్టార్ అయ్యారు – దేవి శ్రీ ప్రసాద్

Published on May 13, 2019 12:00 am IST

‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా మాహర్షి హిట్ లో
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాత్ర కూడా కీలకమైనది. ఆయన సమకూర్చిన పాటలు సినిమాలో విజువల్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు ‘మహర్షి’కి దేవి అందించిన నేపధ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తోంది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నైజాం లాంటి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది.

కాగా చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారితో నా అనుబంధం మర్చిపోలేనిది. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది. డైరెక్టర్ వంశీతో నా జర్నీ వర్షంతో మొదలైంది. తను ఒక మంచి సినిమా మర్చిపోలేని సినిమా తీశాడు. నిజంగా గొప్ప కాన్సెప్ట్ ఉన్న సినిమా చేశారు’ అని అన్నారు

దేవి ఇంకా మాట్లాడుతూ.. ‘మహేష్ గారు టెక్నిషియన్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఎంతో గొప్పది. ఆయనతో ఎవరు పనిచేసినా మళ్ళీ మళ్ళీ పనిచేయాలని ఆశ పడతారు. బహుశా అందుకే అయన సూపర్ స్టార్ అయ్యారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ గారు జీవించేశారు. ఆ పాత్రకు అయన చాల బాగా సూట్ అయ్యారు అని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత సమాచారం :

More