ధఢక్ రెండవ రోజు కూడా బానే రాబట్టింది !

Published on Jul 22, 2018 12:23 pm IST

లేడీ సూపర్ స్టార్ అందాల నటి దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ‘ధఢక్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈనెల 20న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకొని విజయం దిశగా దూసుకుపోతుంది.

ఇక మొదటి రోజు 9కోట్లు రాబట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చిన ఈచిత్రం రెండు రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ ఏకంగా 11 కోట్ల రుపాయలను రాబట్టింది. ఇక మొదటి రెండు రోజులకు 20కోట్లు కలెక్ట్ చేసిన ఈచిత్రం ఈరోజు తో 30కోట్ల క్లబ్ లోకి చేరనుంది.
మరాఠి చిత్రం ‘సైరాత్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రాన్ని హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ , అపూర్వ మెహతా తో కలిసి నిర్మించాడు. కుర్ర హీరో ఇషాంత్ కట్టర్ కథానాయకునిగా నటించిన ఈచిత్రానికి అజయ్ -అతుల్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :