మరిన్ని అంచనాలు పెంచుకున్న “ధమాకా”.!

మరిన్ని అంచనాలు పెంచుకున్న “ధమాకా”.!

Published on Dec 16, 2022 8:01 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం అయితే రవితేజ కెరీర్ లో మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా దీనిపై అయితే మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో మాత్రం మరిన్ని మంచి అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు.

రవితేజ ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ లో కూడా ఈ చిత్రం పై ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ అయ్యింది అని చెప్పొచ్చు. దీనితో ఖిలాడి తర్వాత అందులోని మళ్ళీ తన ఎంటర్టైనింగ్ బ్లాక్ లో ఆయితే రవితేజ కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అనుకున్నట్టుగానే మాస్ మహారాజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది ఈ డిసెంబర్ 23 తో అయితే తేలిపోతుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.

ధమాకా ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు