
టాలీవుడ్ లో బాగా క్రేజ్ ఉన్న యంగ్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఎంతో మంది నిర్మాతలు మహేష్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే నిర్మాతల వరుసలో ఉన్న ప్రముఖ నిర్మాత డివివి దానయ్య మాత్రం ఒకడుగు ముందుకు వేసి మహేష్ బాబు డేట్స్ లాక్ చెయ్యడం కోసం భారీ అమౌంట్ ని ఆఫర్ చేసాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం డివివి దానయ్య మహేష్ బాబు డేట్స్ కోసం సుమారు 22.5 కోట్ల అమౌంట్ ని ఆఫర్ చేసాడని వినికిడి. అలాగే దానయ్య ఆఫర్ చేసిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడు. మరి మహేష్ బాబు ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.
డివివి దానయ్య భారీ అమౌంట్ ఆఫర్ వర్కౌట్ అయితే కొరటాల శివ సినిమా తర్వాత మహేష్ బాబు – వివి వినాయక్ కాంబినేషన్ లో సినిమా కార్య రూపం దాల్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.