ధనుష్ 43 వ చిత్రం ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Jul 27, 2021 2:50 pm IST


తమిళ నాట సెన్సేషన్ సృష్టిస్తున్న ధనుష్ తన సరికొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం సర్వత్రా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సత్య జ్యోతి ఫిల్మ్స్ పతాకం పై టి. జి. త్యాగరాజన్ సమర్పణ లో ధనుష్ తన 43 వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీ.వి ప్రకాష్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియో ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది.

ధనుష్ 43 వ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ ను జులై 28 వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ చిత్రం లో మాలవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :