D55: ‘ఓం’ గా పవర్ఫుల్ ట్రీట్ తో ధనుష్ మాసివ్ ప్రాజెక్ట్.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

D55: ‘ఓం’ గా పవర్ఫుల్ ట్రీట్ తో ధనుష్ మాసివ్ ప్రాజెక్ట్.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

Published on Jun 18, 2026 8:12 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ వెర్సటైల్ హీరో ధనుష్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన స్పీడ్ తో ఇప్పుడు 55వ సినిమా రిలీజ్ వరకు తన లైనప్ వచ్చేసింది. ఇలా దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ సినిమా ఇప్పుడు క్రేజీ గ్లింప్స్ తో టైటిల్ ని రివీల్ చేసుకుంది.

ఈ సినిమాకి మేకర్స్ “ఓం” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక దీనిపై విడుదల చేసిన టీజర్ కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. మొత్తం రాత్రి సన్నివేశం, వర్షంలో కొందరిని పోలీసులు పట్టుకోవడం వారిని కాపాడే సేవియర్ గా ధనుష్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు. ఇక సాయి అభ్యంకర్ సంగీతం ఇందులో అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఇక ఈ చిత్రాన్నీ కూడా ఈ ఏడాదిలోనే విడుదలకి ఫిక్స్ చేసాడు ధనుష్. ఈ అక్టోబర్ 16న సినిమా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఈ గ్లింప్స్  తోనే ఖరారు చేసేసారు. ఇక ఈ సినిమాలో ధనుష్ తో పాటు సాయి పల్లవి, శ్రీలీల అలాగే మమ్ముట్టి లాంటి స్టార్ తారాగణం ఉండడం విశేషం. దీనితో ఈ ప్రాజెక్ట్ పట్ల మూవీ లవర్స్ లో ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు