ధనుష్ తో మరోసారి నాగవంశీ.. హిట్ దర్శకుడుతో సినిమా లాక్!?

కోలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన ధనుష్ హీరోగా మన టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ధనుష్ హీరోగా డైరెక్ట్ తెలుగులో చేసిన సినిమానే సార్. ఈ సినిమా తోనే నిర్మాత నాగవంశీ తెలుగు ఆడియెన్స్ కి ఓ స్ట్రెయిట్/ బై లింగువల్ సినిమాతో పరిచయం చేసారు. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం మరోసారి ఈ క్రేజీ కలయికలో ఓ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

కోలీవుడ్ లో సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘లబ్బర్ పండు’ చేసిన దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు కలయికలో ఓ సినిమాని లాక్ చేసినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పట్ల మంచి బజ్ ఇప్పుడు ఆడియెన్స్ లో ఏర్పడింది. సో ఈసారి ఎలాంటి సినిమాతో ధనుష్, నాగవంశీలు వస్తున్నారో చూడాలి.

Exit mobile version