హాలీవుడ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసిన ధనుష్

Published on Jun 8, 2021 8:03 pm IST

విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ తమిళ హీరో ధనుష్. సినిమా సినిమాకు తనలోని నటుడ్ని ఒక్కొక మెట్టు పైకెక్కిస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఫీల్ అందిస్తున్నాడు. ఆయనలోని ఆ అద్భుతమైన నటన మూలంగానే హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ‘గ్రే మ్యాన్’ చిత్రంలో ధనుష్ ఒక కీలక పాత్ర చేసున్నాడు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు.

నిన్నటితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ధనుష్ సైతం తన పాత్ర తాలూకు చిత్రీకరణను ముగించారు. ఇంకొక రెండు వారాల్లో ఆయన చెన్నై తిరిగిరానున్నారు. ఇది ధనుష్ చేసిన రెండవ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 2018లో ది ‘ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో ధనుష్ నటించాడు. ఇకపోతే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘జగమే తంతిరం’ చిత్రం జూన్ 18న నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :