డిసెంబర్ 27న రానున్న ‘తూటా’ !

Published on Dec 16, 2019 1:04 pm IST

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా, లెజెండరీ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను తెలుగులో ‘తూటా’ పేరుతో గొలుగూరి రామకృష్ణా రెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్‌ పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి ఈ డిసెంబర్ 27న‌ విడుదల చేయనున్నారు.

అయితే ధనుష్ కి ఈ మధ్య తెలుగులో సరైన హిట్ వచ్చి చాల కాలం అయింది. కాగా ఈ సినిమా ఇటీవల తమిళంలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. మరి తెలుగులో సక్సెస్ అవుతుందా చూడాలి. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన మేఘా ఆకాష్ నటిస్తోంది. శశి కుమార్, రాకెందు మౌళి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రాకెందు మౌళి, ఎడిటర్: ప్రవీణ్ ఆంథోని, సంగీతం: దర్బుక శివ, నిర్మాతలు: జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణరెడ్డి,

సంబంధిత సమాచారం :