టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ధనుష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్‌పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాగార్జున చిత్రాలు అంటే తమిళనాట ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంటుందని.. తనకు వ్యక్తిగతంగా నాగ్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని.. ముఖ్యంగా ఆయన నటించిన రచ్చగన్(రక్షకుడు) తన ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా అని ధనుష్ తెలిపాడు.
కుబేర చిత్ర షూటింగ్లో నాగ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని.. ఆయన లాంటి స్టార్ పక్కన యాక్ట్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ధనుష్ పేర్కొన్నాడు. ఇలా నాగార్జునపై ధనుష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


