మరో తెలుగు సినిమాకు రెడీ అవుతున్న ధనుష్?

Published on Sep 10, 2021 3:01 am IST

కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఇంకా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కానీ ధనుష్ మరికొందరు టాలీవుడ్ దర్శకులతో సినిమా చేసేందుకు ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే “ఆర్ఎక్స్ 100” వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతితో సినిమా చేసేందుకు ధనుష్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా “మహా సముద్రం”ను అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ధనుష్ స్వయంగా అజయ్ భూపతిని పిలిపించుకుని కథ ఉంటే చెప్పమని అడిగాడట. ఈ క్రమంలో ప్రస్తుతం కథను సిద్దం చేయడంలో అజయ్ భూపతి బిజీ అయినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే అసలు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :