అక్కడ బెటర్ పెర్ఫార్మన్స్ కొనసాగిస్తున్న “సార్”.!

Published on Feb 21, 2023 7:02 am IST

లేటెస్ట్ గా టాలీవుడ్ సహా కోలీవుడ్ నుంచి వచ్చిన మరో సూపర్ క్లీన్ హిట్ చిత్రం “సార్”. స్టార్ హీరో ధనుష్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ లో “వాథి” పేరిట రిలీజ్ అయ్యింది. మరి ఇలా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ధనుష్ కెరీర్ లోనే బిగ్ హిట్ అయ్యే దిశగా దూసుకెళ్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ సాలిడ్ వసూళ్ళు అందుకున్న ఈ చిత్రం యూఎస్ లో కూడా హవా కొనసాగిస్తోంది.

అక్కడైతే మొదటి రోజు నుంచీ తమిళ్ వెర్షన్ కన్నా తెలుగు వెర్షన్ లోనే అధిక వసూళ్లు నమోదు చేస్తుండడం విశేషం. పైగా తెలుగులో తమిళ్ వెర్షన్ తో లొకేషన్స్ తక్కువ అయినప్పటికీ తెలుగు లోనే ఇప్పటికి కూడా వసూళ్లు నమోదు అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ సినిమా తమిళ్ కన్నా తెలుగు లోనే మంచి లీడ్ తీసుకుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యున్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :