సేఫ్ గేమ్ ఆడుతున్న ధనుష్

Published on Dec 16, 2019 9:48 am IST

తమిళ స్టార్ హీరో ధనుష్, మేఘా ఆకాష్ జంటగా నటించిన తమిళ చిత్రం ”ఎన్నై నొక్కి పాయుమ్ తోట’. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫైనాన్షియల్ సమస్యల కారణంగా అనేక వాయిదాలు పడుతూ వచ్చి చివరకు గత నెల 29న తమిళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో డబ్ చేస్తున్నారు.

ఈ డబ్బింగ్ వెర్షన్ ను విజయభేరి సంస్థ ద్వారా తాతా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఇన్ని రోజులు సరైన రిలీజ్ డేట్ కోసం వెతికిన నిర్మాతలు ఎట్టకేలకు డిసెంబర్ 27వ తేదీని నిర్ణయించారు. ఎందుకంటే ఆరోజు మరే తెలుగు సినిమా విడుదలలేదు. కాబట్టి ఆరోజైతే మెరుగైన ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి తమిళ ప్రేక్షకుల వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల వద్ద ఎలాంటి మార్కులు వేయించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More