‘ఢీ’లో పూనకాలు తెప్పించిన పవర్ స్టార్ కటౌట్..!

Published on Jul 11, 2021 12:35 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తుంది కదా. అందులో బ్రహ్మీ పవన్ కళ్యాణ్ కటౌట్‌తో వెళ్ళి కొన్ని కొన్ని సార్లు కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని విలన్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేసింది. అయితే అచ్చం అలానే పవన్ కళ్యాణ్ కటౌట్‌తో ఢీ షోపై కూడా దుమ్ముదులిపే డ్యాన్సుతో ఇరగదీశారు. ఢీ-13 నుంచి తాజాగా ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.

అయితే ఇందులో మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీలో కార్తీక్ అండ్ టీం పవన్ కళ్యాణ్ పాటలకు వేసిన స్టెప్పులు అక్కడున్న అందరిలో పూనకాలు తెప్పించాయి. జడ్జ్‌గా వ్యవహరిస్తున్న గణేశ్ మాస్టర్ కూడా స్టేజ్‌పైకి వెళ్ళి గబ్బర్ సింగ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు. ఇదే కాకుండా ఆది చేసిన డ్యాన్స్ కూడా నవ్వులు పూయించింది. ఇక చివరలో ఓ ట్విస్ట్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఫుల్ టూ పవన్ మ్యానియాలా కనిపిస్తున్న ఈ ఎపిసోడ్‌ను మిస్ కాకుడదంటే జూలై 14 బుధవారం రాత్రి 9:30 గంటలకు వచ్చే ‘ఢీ’ షోను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :