వచ్చే బుధవారం ‘ఢీ’ని అసలు మిస్సవ్వకండోయ్..!

Published on Jul 15, 2021 2:09 am IST

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్ షోగా పేరు తెచ్చుకున్న ‘ఢీ’ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. దశాబ్ధానికి పైగా డాన్స్ షో లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్న ఢీ ప్రస్తుతం 13వ సీజన్ కొనసాగుతుంది. అయితే ఈ ప్రోగ్రాంలో కంటెస్టెంట్లు చేసే అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే డ్యాన్స్‌లు ఒక్కటే కాదు ప్రేక్షకులకు కావలసిన ఎంటర్‌టైన్మెంట్ కూడా టన్నుల కొద్ది దొరుకుతుంది.

అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి వచ్చే వారం ప్రోమో విడుదలయ్యింది. దానిని చూస్తుంటే ఈ వారంతం పంచ్ డైలాగ్స్, పవర్ ఫుల్ డ్యాన్స్ లతో హోరెత్తేలా అనిపిస్తుంది. కంటెస్టెంట్లు చేస్తున్న డ్యాన్సులు ఓ రేంజ్‌లో ఉంటే, అంతకు మించి అన్నట్టు సుధీర్, రష్మీ, ఆది, దీపిక, యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ ఎప్పటిలాగానే హిలేరియస్‌గా అనిపించింది. ఇక ఇందులో మరో విశేషమేమిటంటే సుధీర్, రష్మీలు ఓ కంటెస్టెంట్‌తో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అయితే ఈ ఫుల్ టూ కామెడీ,అండ్ డ్యాన్స్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే రేపు వచ్చే బుధవారం ఈటీవీలో ఢీ 13ను తప్పక చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :