“ఢీ-13” చాప్టర్-2 వేరే లెవల్‌లో ఉందిగా..!

Published on Jul 31, 2021 1:31 am IST

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్ షోగా పేరు తెచ్చుకున్న ‘ఢీ’ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్ధానికి పైగా డాన్స్ షో లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్న ఢీ ప్రస్తుతం 13వ సీజన్ ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ కొనసాగుతుంది. అయితే ‘కొరియోగ్రాఫర్‌ విత్‌ కంటెస్టెంట్‌’ చాప్టర్-1 తో ఈ వారం ఎపిసోడ్ అలరించగా వచ్చే వారం చాప్టర్-2తో దుమ్మురేపేందుకు టీం సిద్దమయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.

అయితే గత ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్ వేరె లెవల్‌లో ఉందనిపిస్తుంది. చైతన్య మాస్టర్ చిన్న పిల్లాడి గెటప్‌లో క్యూట్ డ్యాన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. అతని డ్యాన్స్‌కు ఫిదా అయిపోయిన జడ్జ్ పూర్ణ స్టేజ్‌పైనే అతడి బుగ్గ కొరికేసింది. ఇక అలవైకుంఠపురంలోని ‘సామజవరగమన’ పాటకి అభి మాస్టర్ తన కంటెస్టెంట్‌తో చేసిన డ్యాన్స్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ఇదంతా ఒకెత్తైతే యాంకర్ ప్రదీప్ ఆటో డ్రైవర్‌గా మారి స్టేజ్‌పైకి ఆటోతో వచ్చాడు. ఈ క్రమంలో సుధీర్, ఆది, ప్రదీప్‌ల మధ్య చోటు చేసుకున్న కామెడీ హిలేరియస్‌గా అనిపించింది. మరీ ఈ ఫుల్ టూ కామెడీ అండ్ డ్యాన్స్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే రాబోయే బుధవారం ఈటీవీలో వచ్చే ఢీ 13ను తప్పక చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోను చూసేయండి

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :