ఈ బుధవారం ‘ఢీ’ బొమ్మ దద్దరిల్లిపోనుందట..!

Published on Jul 2, 2021 4:09 am IST


దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్ షోగా పేరు తెచ్చుకున్న ‘ఢీ’ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. దశాబ్ధానికి పైగా డాన్స్ షో లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్న ఢీ ప్రస్తుతం 13వ సీజన్ కొనసాగుతుంది. అయితే ఈ ప్రోగ్రాంలో కంటెస్టెంట్లు చేసే అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే డ్యాన్స్‌లు ఒక్కటే కాదు ప్రేక్షకులకు కావలసిన ఎంటర్‌టైన్మెంట్ కూడా టన్నుల కొద్ది దొరుకుతుంది.

అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి వచ్చే వారం ప్రోమో విడుదలయ్యింది. ప్రొమో చూస్తుంటే ఈ వారంతం కంటెస్టెంట్లు చేస్తున్న డ్యాన్సులు అద్భుతంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అభి చేసిన డ్యాన్స్‌కి పూర్ణ మేడం ఫిదా అయ్యి అభికి స్టేజ్‌పై ముద్దు పెట్టింది. ఇక సుధీర్, ఆది మరియు ప్రదీప్‌ల మధ్య రాజేసుకునే కామెడీ ఎప్పటిలాగానే నవ్వులు పూయించింది. అయితే ఈ ఫన్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఈ బుధవారం ఈటీవీలో వచ్చే ఢీ 13ను తప్పక చూడండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :