స్మాల్ స్క్రీన్ హిస్టరీలో ఇది ఒక సంచలనమే.!

Published on Aug 29, 2020 12:12 pm IST

మన తెలుగు బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ అంటే ఈటీవీ తెలుగు ఛానెల్ కు తిరుగు లేదని చెప్పాలి. అదిరిపోయే ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ వీరి తర్వాతే ఎవరైనా. ఛానెల్లో టెలికాస్ట్ అయినప్పుడు రేటింగ్ కానీ వాటి తాలూకా వీడియోస్ కు యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ కానీ రికార్డు లెవెల్లో ఉంటాయి.

అలా ఈ ఛానెల్లో ప్రసారం అయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ డాన్స్ షో “ఢీ ఛాంపియన్స్” కు చెందిన లేటెస్ట్ ప్రోమో ఇప్పటి వరకు ఏ స్మాల్ స్క్రీన్ ప్రోగ్రాం ప్రోమోను తెచ్చుకోని స్థాయి రెస్పాన్స్ ను యూట్యూబ్ లో రాబట్టింది. స్మాల్ స్క్రీన్ హీరో సుడిగాలి సుధీర్ పై ప్లాన్ చేసిన ప్రత్యేక సాంగ్ ఇందుకు ప్రధాన కారణం అని చెప్పాలి.

అతని లైఫ్ స్టోరీపై ప్లాన్ చేసిన సాంగ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవడంతో కేవలం ఒకటిన్నర రోజులోనే 5.3 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడమే కాకుండా ఊహించని విధంగా 1 లక్ష 98 వేలు లైక్స్ ను రాబట్టింది. ఇది మాత్రం సెన్సేషన్ అనే చెప్పాలి. అంతే కాకుండా ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ 4 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :