ఉర్రూతలూగిస్తున్న “ఆకాశవాణి” జాతర సాంగ్..!

Published on Jul 10, 2021 3:02 am IST

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న‌ తాజా చిత్రం ”ఆకాశవాణి”. విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోశిస్తున్నారు. అయితే ఈ సినిమా జూన్‌ 4న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు పెరిగాయి.

అయితె ఇప్పటికే రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ సినిమా నుంచి “దిమ్సారే” అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. క్రేజీ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. జాతరకు సంబంధించిన ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. కాల భైరవ స్వరాలు సమకూర్చగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీనీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :