మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ’తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభం అయిన షెడ్యూల్ లో ప్రస్తుతం రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. నిజానికి ’తని ఒరువన్’ సినిమా రీమేక్ కావడంతో ఈ సినిమా పక్కాగా తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి ఆగష్టు లో విడుదల చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్ది, నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్టు సమాచారం. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
ప్రస్తుతం మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ని శరవేగంగా పూర్తిచేసి సెప్టెంబర్ 30 న విడుదల చేస్తున్నట్టు సమాచారం. ‘బ్రాస్ లీ ‘ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో రామ్ చరణ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ట్రైనీ ఐపీయస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.


