బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సాలిడ్ స్పై యాక్షన్ సినిమానే ధురంధర్ 2 రివెంజ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రికార్డ్ రన్ ఈ సినిమా చూస్తుంది. ఇలా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా నెవర్ బిఫోర్ నంబర్స్ సెట్ చేస్తున్నట్టు బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మొత్తం 8 రోజుల్లో 29 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని ఈ సినిమా రాబట్టి ఏకంగా 279 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. ఇలా ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే 500 కోట్ల వసూళ్లు ఈ సినిమా అందుకునే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. సో ఫైనల్ గా ఈ సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి శశ్వత్ సచ్ దేవ్ సంగీతం అందించగా జియో స్టూడియోస్, బి 62 స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.
