బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సాలిడ్ స్పై యాక్షన్ చిత్రమే “ధురంధర్”. దీనికి సీక్వెల్ గా పార్ట్ 2 ఇప్పుడు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా ఈ సినిమాకి మరో భారీ చిత్రం టాక్సిక్ పోటీలో ఉంది. అయితే ఈ సినిమాల క్లాష్ పోటా పోటీగా ఉంటుంది అని చాలా మంది భావించారు.
కానీ అనూహ్యంగా యూఎస్ మార్కెట్ కి బుకింగ్స్ ఓపెన్ అయ్యాక అందులో ధురంధర్ 2 క్లియర్ మార్జిన్ చూపిస్తుంది. ఈ సినిమాకి ఆల్రెడీ లక్ష డాలర్స్ మార్క్ అది కూడా కేవలం హిందీ వెర్షన్ లోనే దాటేసినప్పటికీ టాక్సిక్ మాత్రం ఇంకా 20 వేల డాలర్స్ మార్క్ కూడా అందుకోలేదు అన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ ఇందులో ఓ 12 వేల డాలర్స్ తెలుగు వెర్షన్ నుంచే ఉన్నాయట. సో టాక్సిక్ ఎంత వెనకబడిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ట్రైలర్ వచ్చాక ఏమన్నా మారుతుందేమో చూడాలి.
