‘ధురంధర్’ దెబ్బకు కుప్పకూలిన బాలీవుడ్ స్పై యూనివర్స్!

‘ధురంధర్’ దెబ్బకు కుప్పకూలిన బాలీవుడ్ స్పై యూనివర్స్!

Published on Jul 4, 2026 11:56 PM IST

Dhurandhar

ఒకప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ ‘ఏక్ థా టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో భారీ స్పై యూనివర్స్‌ను క్రియేట్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది. కానీ, కాలక్రమేణా రా ఏజెంట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐ చుట్టూనే తిరిగే రొటీన్ కథలతో ప్రేక్షకులకు విసుగొచ్చింది. దీనివల్ల ‘టైగర్-3’, ‘వార్-2’ చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి.

తాజాగా విడుదలైన ‘ఆల్ఫా’ చిత్రం కనీస ఓపెనింగ్స్ కూడా సాధించలేక, ఈ యూనివర్స్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పతనానికి ప్రధాన కారణం ‘ధురంధర్’ సినిమానే. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా, స్పై జానర్‌ను ఎంత అథెంటిక్‌గా, ఆసక్తికరంగా తీయవచ్చో ‘ధురంధర్’ నిరూపించి ప్రేక్షకులకు సరికొత్త కిక్ ఇచ్చింది.

‘ధురంధర్’ లాంటి క్వాలిటీ సినిమాను చూసిన తర్వాత, బాలీవుడ్ పాత ఫార్ములా సినిమాలను ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. మొత్తంగా, ‘ధురంధర్’ సృష్టించిన ఇంపాక్ట్ బాలీవుడ్ స్పై జానర్‌ను పూర్తిగా దెబ్బతీసింది. ‘ఆల్ఫా’ ఘోర పరాజయం తర్వాత యశ్ రాజ్ సంస్థ మరో స్పై సినిమా తీసే సాహసం చేయడం కష్టమే.

తాజా వార్తలు