ఓటీటీలో ‘ధురంధర్’ ఊచకోత.. 20 దేశాల్లో ట్రెండింగ్, పాకిస్తాన్ లో కూడా విధ్వంసం

Dhurandhar

ఇటీవల వచ్చి ఇండియన్ సినిమా దగ్గర సింగిల్ లాంగ్వేజ్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన భారీ హిట్ చిత్రం “ధురంధర్”(Dhurandhar) కోసం అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల పానిండియా భాషల్లో ఓటీటీ లోకి వచ్చి ఇక్కడ కూడా సంచలనం సెట్ చేస్తుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో ఊహించని రెస్పాన్స్ తో దూసుకెళ్లిపోతుంది. ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా 20 దేశాలకి పైగా ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

దాదాపు అన్ని దేశాల్లో ఈ చిత్రం నెంబర్ 1 ప్లేస్ లోనే ట్రెండ్ అవుతుండడం విశేషం. ఇదొక్కటే కాకుండా ఈ సినిమా పాకిస్తాన్ లో కూడా టాప్ 1 లో ట్రెండ్ అవుతుంది. దీనితో ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ లో అదరగొడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్ గా నటించగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మార్చ్ 19న పార్ట్ 2 రాబోతుంది.

Exit mobile version