డైలాగ్ కింగ్ “స‌న్ ఆఫ్ ఇండియా” కొత్త షెడ్యూల్ ఇక్కడే.!

డైలాగ్ కింగ్ “స‌న్ ఆఫ్ ఇండియా” కొత్త షెడ్యూల్ ఇక్కడే.!

Published on Nov 25, 2020 2:00 PM IST

తన డైలాగ్ మాడ్యులేషన్ తో తెలుగు సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ ను సెట్ చేసుకున్న సీనియర్ హీరో డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న‌ దేశ‌భ‌క్తి క‌థా చిత్రం ‘స‌న్ ఆఫ్ ఇండియా’. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో డాక్ట‌ర్‌ మోహ‌న్‌బాబు న‌టిస్తోన్న ఈ త‌ర‌హా క‌థ కానీ, ఈ జాన‌ర్ సినిమా కానీ ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్‌లో రాలేదు.మొద‌ట తిరుప‌తి షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసింది. అక్క‌డ కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించారు.

అయితే ఈరోజు బుధ‌వారం హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను ప్రారంభించారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై అధిక భాగం స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రిస్తారు.మోహ‌న్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయ‌న కోడ‌లు విరానికా మంచు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం. మోహ‌న్‌బాబును ఆమె పూర్తిగా స‌రికొత్త రూపంలో చూపిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు అందిస్తుండగా స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు స్వ‌యంగా స్క్రీన్‌ప్లే స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్ సంభాష‌ణ‌లు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాట‌లు రాస్తుండ‌గా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా చిన్నా ప‌నిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు