
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా బాలకృష్ణపై వచ్చే ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ ని షాట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో అజయ్, కబీర్ దుహన్ సింగ్ తో పాటు 100 మంది ఫైటర్స్ కూడా పాల్గొంటున్నారు. బాలయ్య ఈ 100 మందిని చితకబాదే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. దడిలా ఉంటే అభిమానుల కోసం వినాయక చవితి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ మరియు జై గణేశా సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్ర టీం త్వరలోనే అభిమానులకు మరో ట్రీట్ ఇవ్వడానికి సిద్దమైంది. అదే డిక్టేటర్ ఫస్ట్ టీజర్. తెలుగువారంతా ఘనంగా జరుపుకునే దసరా కానుకగా అనగా అక్టోబర్ 21వ తేదీ అర్ధరాత్రి రిలీజ్ చెయ్యడానికి సిద్దమయ్యారు. ఇటీవలే యూరప్ లో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం శరవేగంగా షూట్ ని ఫినిష్ చేస్తోంది. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

