నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డిక్టేటర్’. ఇప్పటికే సగంభాగం పైన షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే ఇంటర్వల్ బ్లాక్ లో 100 మంది ఫైటర్స్ తో బాలకృష్ణపై వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని బాలకృష్ణ కెరీర్లో సంథింగ్ స్పెషల్ అండ్ డిఫరెంట్ మూవీగా నిలిచిపోయేలా తీస్తున్నాడు.
తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియో లాంచ్ కి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది. డిసెంబర్ మొదటి కల్లా సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి డిసెంబర్ 3వ వారంలో డిక్టేటర్ ఆడియోని రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. అలాగే ఆడియో రిలీజ్ వేడుకని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనంగా చేయడానికి నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగనున్న మొదటి గ్రాండ్ ఆడియో లాంచ్ డిక్టేటర్ దే కావడం విశేషం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ అందించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.


