ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన లేటెస్ట్ సంచలన హిట్ చిత్రమే పుష్ప 2 ది రూల్. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రికార్డు వసూళ్లు అందుకొని అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో ఉన్న ఎన్నో బిగ్గెస్ట్ హైలైట్స్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ అండ్ పలు పాటలు కూడా ఒకటి.
మెయిన్ గా ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచి కూడా ఎంతో హైప్ ఇస్తూ వచ్చిన ఎపిసోడ్ జాతర ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్ కి గంగో రేణుకమ్మ తల్లి సాంగ్ మరింత హైలైట్ గా నిలిచింది. అయితే ఈ సాంగ్ వెనుక అసలు కథని దేవిశ్రీ ప్రసాద్ రివీల్ చేసాడు. మొదట మేకర్స్ ఈ సీక్వెన్స్ లో కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉండేలా ఒక పవర్ఫుల్ బిట్ ని ప్లాన్ చేసినట్టుగా తెలిపారు.
సుకుమార్ మొదట సీన్ చూపిస్తే దీనికి ఇది సరిపోదు అని వెంట వెంటనే ఫుల్ సాంగ్ ని తాను చంద్రబోస్ గారు కంపోజ్ చేసేసి సుకుమార్ కి అందించామని చెప్పారు. దీనితో సుకుమార్ కూడా ఒకింత షాకయ్యి ఆ ఫుల్ సాంగ్ విన్నాక ఎంతో నచ్చింది. అని అలా సినిమాలో సాలిడ్ ఎమోషన్స్ తో ఈ సాంగ్ వచ్చినట్టుగా దేవిశ్రీ ప్రసాద్ అసలు విషయం రివీల్ చేసాడు. ఇక సినిమాలో ఈ సాంగ్ ఎంత పెద్ద హైలైట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.