‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రం ఆఖరి దశ పనుల్లో ఉంది. ఏప్రిల్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చిన టీమ్ త్వరలో భారీస్థాయిలో ఆడియో వేడుకను నిర్వహించనుంది.

సినీ వర్గాల సమాచారం మేరకు ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని పోలిన సెట్ వేస్తారట. ఎందుకంటే మహేష్ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు, అసెంబ్లీ నైపథ్యంలో కూడ కీలక సన్నివేశాలు ఉండనున్నాయి. అందుకే భిన్నంగా ఉంటుందని ఈ తరహాలో ప్లాన్ చేశారట. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.