డిఫరెంట్ టైటిల్ తో రవితేజ సినిమా !
Published on Nov 14, 2017 11:17 am IST

ఒకప్పుడు వరుసగా సినిమా చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉండే శ్రీనువైట్ల ఈ మద్య తను తీసిన చిత్రాలేమీ పెద్దగ ఆకట్టుకోవడం లేదు. తాజాగా ఈ డైరెక్టర్ రవితేజ తో సినిమా చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. గతంలో రవితేజ ‘నీకోసం’ సినిమా ద్వారానే శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరవాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వెంకీ’, ‘దుబాయి శీను’ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ ఆసక్తికర టైటిల్‌ ఫిక్స్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తునట్లు సమాచారం. ‘అమర్ అక్బర్ అంథోని’ అనే విభిన్నమైన టైటిల్ ఈ సినిమాకు యాప్ట్ టైటిల్ అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వినికిడి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

 
Like us on Facebook