అల్లు శిరీష్ ఏబిసిడి కి వినూత్నమైన సంగీతం !

Published on Oct 23, 2018 8:51 am IST

యువ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదలకానుంది. ఇక ఈ చిత్రానికి శాండీ ఒక కొత్తరకమైన సంగీతం అందిస్తున్నారు.

నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బెన్ సినిమాస్ , మధుర ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక మలయాళం లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది.

సంబంధిత సమాచారం :