తలైవి డిజిటల్ ప్రీమియర్ పై అప్డేట్ ఇదే!

Published on Sep 2, 2021 7:40 pm IST


కంగనా రనౌత్, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో ఎ. ఎల్ విజయ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం తలైవి. ఈ చిత్రం జయలలిత జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నటిగా, రాజకీయ నాయకురాలు గా, ముఖ్యమంత్రి గా జయలలిత ప్రస్థానం ను ఈ చిత్రం లో చుపించనున్నారు. ఈ చిత్రం తమిళ భాషలో మాత్రమే కాకుండా, ఇతర బాషల్లో సైతం విడుదల కానుంది.

ఈ చిత్రం ను సెప్టెంబర్ 10 వ తేదీన వినాయక చవితి శుభాకాంక్షల తో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 10 వ తేదీన థియేటర్ల లో విడుదల కానున్న ఈ చిత్రం ను నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చేసేందుకు మేకర్స్ తాజాగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ భాషలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :