ఫోక్ సెన్సేషన్ గా “దిగు దిగు దిగు నాగ”… ట్రెండ్ అవుతోంది గా!

Published on Aug 5, 2021 7:28 pm IST

లక్ష్మి సౌజన్య దర్శకత్వం లో నాగ శౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఒక పాట ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. అయితే దిగు దిగు దిగు నాగ అంటూ విడుదల అయిన ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం ట్రెండ్ అవుతోంది. విడుదల అయిన ఒక్క రోజు లోనే ఈ పాట 2.7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

దిగు దిగు దిగు నాగ అనే పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, శ్రేయా ఘోషల్ స్వర పరిచారు. ఈ పాటకి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న నేపథ్యం లో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :