దిల్ రాజు చేతికి తమిళ సినిమా రీమేక్ హక్కులు !
Published on Sep 11, 2018 3:00 pm IST

ప్రముఖ నిర్మాత ,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు తాజాగా తమిళ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ’96’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఫొటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు.

ఇక ఇటీవల చెన్నై వెళ్లిన దిల్ రాజు ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ లో వీక్షించిన అనంతరం ఆయనకు ఈ సినిమా నచ్చి తెలుగు రీమేక్ రైట్స్ ను కొన్నాడని సమాచారం. మరి దిల్ రాజు ఈచిత్రాన్ని తెలుగులో ఎవరి తో రీమేక్ చేస్తాడో చూడాలి

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook