‘వకీల్ సాబ్’ ఎర్లీ స్ట్రీమింగ్.. మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందట

Published on Apr 29, 2021 11:37 pm IST

టాలీవుడ్ నిర్మాతలు ఓటీటీలతో చేసుకున్న ఒప్పందం మేరకు సినిమా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ విడుదలకు మధ్యన కనీసం నెలన్నర గ్యాప్ ఉండాలి. కానీ ‘వకీల్ సాబ్’ విషయంలో ఇది కుదరలేదు. చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈరోజు రాత్రి డేట్ మరగానే అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా స్ట్రీమింగ్ మొదలైకానుంది. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదు. సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి సినిమా అనేశారు. ప్రైమ్ సంస్థతో ఇదే రీతిన అగ్రిమెంట్ చేసుకున్నారు.

కానీ ఈలోపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడం, కేసులు పెరగడం, థియేటర్లు మూతపడటం జరిగుపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా రన్ చాలా త్వరగా ముగిసిపోయింది. రావాల్సిన స్థాయిలో వసూళ్లు రాలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ ఎర్లీ రిలీజ్ ఆప్షన్ ఎంచుకున్నారు. సినిమా థియేటర్లలో లేనప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయడంలో తప్పేమీ లేదు కాబట్టి 30వ తేదీ అనగా ఈరోజు రాత్రి నుండి స్ట్రీమింగ్ ఇవ్వడానికి ఓకే అనేశారు. ఈ ముందస్తు విడుదల ద్వారా నిర్మాతకు రూ.12 కోట్ల వరకు అదనపు లాభం చేకూరినట్టు తెలుస్తోంది. ఇక అభిమానులైతే థియేటర్లలో మిస్సైనా ‘వకీల్ సాబ్’ను ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :