దిల్ రాజు పవన్ సినిమా కోసం తనని ఫిక్స్ చేశారా.?

Published on Apr 28, 2021 12:27 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కోవిడ్ కారణంగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే మరో పక్క తన లైనప్ లో చాలానే సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అవి మాత్రమే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించి టాక్ కూడా ఇండస్ట్రీలో విస్తృతంగా సాగుతుంది.

అలా లేటెస్ట్ గా వకీల్ సాబ్ సినిమాను నిర్మాణం వహించిన పవన్ ఫ్యాన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో సినిమా పవన్ తో చేయనున్నారని అందుకు గాను దర్శకుని వేటలో పడ్డారని ఇటీవల టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్ గా దర్శకుడు దొరికేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అది మరెవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి అట. సూపర్ స్టార్ మహేష్ తో చేసిన “మహర్షి” అనంతరం ఈ దర్శకుడు కొన్ని కారణాల వల్ల ఖాళీగానే ఉండాల్సింది. మరి ఇప్పుడు ఈ దర్శకుడ్ని లాక్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇది ఎంత వారు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :