భారీ ‘హిట్’కు.. భారీ ‘గిఫ్ట్’లు !

Published on Mar 3, 2019 10:10 pm IST

టాలీవుడ్ లో ఈ జనరేషన్ నిర్మాతల్లో సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ ఎవరు అంటే.. ముందుగా గుర్తు వచ్చే పేరు ‘దిల్ రాజు’. ఆయన నిర్మాణంలో సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువుగానే ‘ఎఫ్ 2’ చిత్రం కలెక్షన్స్ ను సాధించింది.

పైగా దిల్ రాజు నిర్మాణంలో ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లోనే భారీ హిట్ గా నిలిచి 50 రోజులును పూర్తిచేసుకుంది. సినిమా కొన్న డిస్టిబ్యూటర్స్ కు కూడా మంచి లాభాల్ని అందించింది ఈ చిత్రం. అందుకే ఈ సినిమాకు పని చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు లేటెస్ట్ ఐ ఫోన్స్ ను గిఫ్ట్ లుగా ఇచ్చారు దిల్ రాజు.

మొత్తానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ భారీ హిట్ అవ్వడం అలాగే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రెవిన్యూని రాబట్టడంతో ఎఫ్ 2 చిత్రబృందం ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

సంబంధిత సమాచారం :