గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. ప్రముఖ దర్శకుడు శంకర్ కలయికలో చేసిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. పై పెచ్చు రిలీజ్ అయ్యిన రోజు నుంచే భారీ నెగిటివ్ సహా సినిమా పైరసి ఫుల్ క్లారిటీ ప్రింట్ బయటకి వచ్చేయడం వంటివి పెద్ద దెబ్బ తీశాయి. మరి ఈ పైరసి అంశంపై లేటెస్ట్ గా దిల్ రాజు చేసిన హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాను నిర్మాణం వహించిన గేమ్ ఛేంజర్ సినిమాని నేనే పైరసి చేసుకున్నాను అని ఒక నిర్మాత అన్నారు అని అసలు నా సినిమాని నేనేందుకు పైరసి చేసుకుంటానని ప్రశ్నించారు. అది ఎంత నీచం నా సినిమాని నేను కాపాడుకుంటాను కానీ పైరసి చేసుకుంటానా అని మండిపడ్డారు. అలాగే సినీ పరిశ్రమలో ఆ నలుగురిలో నేను కూడా లేనని క్లారిటీ ఇచ్చారు. దీనితో తన స్టేట్మెంట్ ఇపుడు వైరల్ గా మారింది.