దిల్ రాజు చేతులు మీదుగా ‘ నేను లేని నా ప్రేమ‌క‌థ‌’ ఫస్ట్ లుక్ లాంఛ్

దిల్ రాజు చేతులు మీదుగా ‘ నేను లేని నా ప్రేమ‌క‌థ‌’ ఫస్ట్ లుక్ లాంఛ్

Published on Feb 14, 2020 11:44 AM IST

డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వాలంటైన్స్ డే స్సెషల్ గా ‘ నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంఛ్ చేసారు. ఒక విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉందని దిల్ రాజు అభినందించారు.

చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌గా సురేష్ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో న‌వీన్ చంద్ర స‌ర‌స‌న గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి లు మ‌రో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంల ప్ర‌ముఖ న‌టుడు రాజార‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత క‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు మా సినిమా ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథ లు తెరపై చాలా కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్ర‌తిఓక్క‌రూ వారి వారి ప్రేమ క‌థ‌కి కి ద‌గ్గ‌ర‌వుతారు. న‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్ సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి న‌టించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని దిల్ రాజు గారు అభినందించారు’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు