దిల్ రాజు చేతికి కళ్యాణ్ రామ్ సినిమా !

Published on Feb 23, 2019 10:45 am IST


కళ్యాణ్ రామ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’ విడుదలకు సిద్దమవుతుంది. కాగా రీసెంట్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా చూసి ఆయనకు బాగా నచ్చడంతో సినిమాను ఏపీ &తెలంగాణ లో ఆయనే విడుదలచేయనున్నారని సమాచారం అలాగే ఓవర్సీస్ లో నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని విడుదలచేయనుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిదిగా వస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈదీనిపై క్లారిటీ రావాల్సి వుంది. కెవి గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నివేత థామస్, శాలిని పాండే కథానాయికలుగా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం మార్చి 1 న విడుదలకానుంది. ఆ రోజు పెద్ద సినిమాలు విడుదలకాకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది.

సంబంధిత సమాచారం :