దిల్ రాజు కూడా సర్దుబాటు చేయలేకపోతున్నారా ?

Published on Oct 14, 2019 10:02 pm IST

ఎంత సంక్రాంతి సీజన్ అయినా ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలకావడం ఏమంత మంచి పరిణామం కాదు. స్టార్ హీరోల సినిమాలంటేనే వచ్చే లాభం తక్కువ, పోతే కలిగే నష్టం ఎక్కువ. ఎంత కాదన్నా ఇది అక్షర సత్యం. ఇలాంటి తరుణంలో మొదటి రెండు మూడు రోజుల వసూళ్ల మీదే సినిమాను కొన్నవారు ఆశలు పెట్టుకుని ఉంటారు. అలాంటిది ఆ వసూళ్లకే గండి పడే పరిస్థితి వస్తే.

‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. నిర్మాతలు, హీరోల మధ్య ఏం జరిగిందో ఖచ్చితంగా తెలీడంలేదు కానీ పంతం మీద రెండు సినిమాలు ఒకే రోజున దిగుతున్నాయని మాత్రం అర్థమవుతోంది. సాధరణంగా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ ఇద్దరూ ఇలాంటి పోటీని స్వాగతించారు. వీలైనంతవరకు కాంప్రమైజ్ చేసుకుని సేఫ్ రిలీజ్ ప్లాన్ చేస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు.

పైగా ‘సరిలేర నీకెవ్వరు’ నిర్మాణంలో భాగస్వామి అయిన దిల్ రాజు గీతా ఆర్ట్స్, హారికా హాసిని సంస్థలకు కీలక బయ్యర్. ఇప్పటికే వాళ్ళ సినిమాలు చాలా వాటిని కొన్న ఆయన, ‘అల వైకుంఠపురములో’ చిత్ర నైజాం హక్కుల్ని దక్కించుకున్నారట. అంటే పోటీలో ఉన్న రెండు సినిమాల్లో దిల్ రాజు పెట్టుబడి ఉంది. అలాంటిది ఆయన రెండూ క్లాష్ అవుతున్నా ఎలా ఊరుకున్నారు, కాంప్రమైజ్ చేయలేదా, చేయలేకపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇకనైనా ఈ సర్దుబాటు జరిగి ఎవరో ఒకరు వెనక్కి తగ్గి సేఫ్ గేమ్ అడుతారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More