నానితో హ్యాట్రిక్ ఖాయమంటున్న దిల్ రాజు !


నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ఈ నెల 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నానితో గత ఏడాది తాను నిర్మించిన ‘నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి’ వంటి చిత్రాలు ఘన విజయాల్ని అందుకున్నాయని అదే తరహాలో ఈ సంవత్సరం తాను రిలీజ్ చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ కూడ విజయం సాధించి తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఈ చిత్రం ఈ వేసవిలో కుటుంబసమేతంగా చూదగిన చిత్రంగా విజయాన్ని సాదిస్తుందని నాని అన్నారు. హిపాప్ తమిజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు కథానాయకిలుగా నటించారు.