కీర్తి సురేష్ సినిమాకు దిల్ రాజు సపోర్ట్

Published on Jul 15, 2019 6:31 pm IST

నిర్మాత దిల్ రాజు సినిమాల్ని నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడమే కాదు అప్పుడప్పుడు ఇతర న్రిమాటల సినిమాను సమర్పకుడిగా వ్యవహరిస్తుంటారు కూడా. ప్రసుతం కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఒక చిత్రాన్ని దిల్ రాజు ప్రజెంట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ కానున్నాయి.

ఇలా దిల్ రాజు తన సినిమాకు సపోర్ట్ చేయడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మొదటిసారి తమ నిర్మాణం సంస్థలో నిర్మితమవుతున్న సినిమాకు ఇంతకంటే మంచి స్టార్ట్ దొరకదని, దిల్ రాజుగారితో వర్క్ చేయడం కొంచెం కంగారుగా కొంచెం ఎగ్జైటింగా ఉందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మరొక స్టార్ నటుడు జగపతిబాబు సైతం ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More