“క్షీర సాగర విజయం” నా ఒక్కడిదే కాదు..డైరెక్టర్ అనిల్ పంగులూరి

“క్షీర సాగర విజయం” నా ఒక్కడిదే కాదు..డైరెక్టర్ అనిల్ పంగులూరి

Published on Aug 7, 2021 2:30 PM IST


నిన్ననే విడుదల కాబడినటువంటి తెలుగు చిత్రాల్లో “క్షీరసాగర మథనం” కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తుండడం చాలా సంతోషాన్ని, ఒకింత గర్వాన్ని ఇస్తోంది అంటున్నారు చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి. మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరిని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

అలాగే అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు చెబుతున్నప్పటికీ… ఓవరాల్ గా అందరూ మెచ్చుకుంటున్నారని అనిల్ చెబుతున్నారు. మానస్, అక్షత, గౌతమ్ శెట్టి, చరిష్మా, మహేష్ లతోపాటు… ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటోందని… అజయ్ అరసాడ సంగీతానికి, సంతోష్ శానమోని కెమెరా వర్క్ కి చాలా మంచి మార్కులు వేస్తున్నారని అనిల్ ఆనందం వ్యక్తం చేశారు. క్యారక్టర్ అంటే వర్జినిటీ కాదని చెప్పడాన్ని అందరూ ఆప్రిషియేట్ చేస్తున్నారని. అయితే ఈ విజయం తన అక్కడికే సొంతం కాదని… నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ సమానంగా చెందుతుందని అనిల్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు